What did we cover in the class?
మీ అందరికీ నూతన సంవత్సరం 2020 శుభాకాంక్షలు!
Core Activity
Story
Story of Gajendra Moksham was narrated, along with the tales of previous births of Gajendra and the crocodile.
Padyalu
During narration of the story of Gajendra Moksham, 2 relevant padyams from pOtana bhaagavatam were taught. They are given below.
kalaDanduru deenula yeDa
galaDanduru paramayOgi gaNamula paalan
kalaDanduranni diSalanu
kalaDu kalanDanenDuvaaDu kalaDO lEDO
bhaavamu: deenulanu kaapaaDuTaku bhagavantuDu dayaaLuvayi unnaaDanTaaru. mahaayOgula hRdayaalalO unTaaDani anTaaru. kalaDu kalaDu anE dEvuDu anni dikkulalOnU unTaaDanTaaru. unnaaDunnaaDanE aa dEvuDu asalu unnaaDaa lEDA? unTE enta praarthinchinaa raaDEmTI? inni rakaalugaa unnaTlayitE naa praarthana vini nannu vachchi kaapaaDaali kadaa!
కలడందురు దీనుల యెడ
గలడందురు పరమయోగి గణముల పాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెండువాడు కలడో లేడో
భావము: దీనులను కాపాడుటకు భగవంతుడు దయాళువయి ఉన్నాడంటారు. మహాయోగుల హృదయాలలో ఉంటాడని అంటారు. కలడు కలడు అనే దేవుడు అన్ని దిక్కులలోనూ ఉంటాడంటారు. ఉన్నాడున్నాడనే ఆ దేవుడు అసలు ఉన్నాడా లేడా? ఉంటే ఎంత ప్రార్థించినా రాడేంటీ? ఇన్ని రకాలుగా ఉన్నట్లయితే నా ప్రార్థన విని నన్ను వచ్చి కాపాడాలి కదా!
evvanichE janinchu jagamevvani lOpalanunDu leenamai?
yevvaniyanduDindu? baramESwarauDevvaDu? moolakaaraNam
bevva? Danaadi madhyalayuDevvaDu? sarvamu taaneyaina vaa
DevvaDu? vaani naatmabhavu nISwarunE SaraNambu vEDedan.
bhaavamu: ee jagattu antaa evani valana puDutunnadO, perugutunnadO, evaniyandu leenamautunnadO evaDI samasta jagattukI moolakaaraNamayina prabhuvayi unTaaDO, evaDu aadi, madhya, antamu anE mooDunU taanE ayi unTaaDO, evaDu kaavaalannappuDu puTTagalavaaDO, ee jagattukE prabhuvayina aa mahaanubhaavuni rakshaNa kOrukunTunnaanu.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై?
యెవ్వనియందుడిందు? బరమేశ్వరౌడెవ్వడు? మూలకారణం
బెవ్వ? డనాది మధ్యలయుడెవ్వడు? సర్వము తానెయైన వా
డెవ్వడు? వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్.
భావము: ఈ జగత్తు అంతా ఎవని వలన పుడుతున్నదో, పెరుగుతున్నదో, ఎవనియందు లీనమౌతున్నదో ఎవడీ సమస్త జగత్తుకీ మూలకారణమయిన ప్రభువయి ఉంటాడో, ఎవడు ఆది, మధ్య, అంతము అనే మూడునూ తానే అయి ఉంటాడో, ఎవడు కావాలన్నప్పుడు పుట్టగలవాడో, ఈ జగత్తుకే ప్రభువయిన ఆ మహానుభావుని రక్షణ కోరుకుంటున్నాను.
PanDagalu
From the textbook తెలుగు వాచకం 1వ తరగతి, I read (as students were following) and discussed about Ugadi festival (pg 18 & 19). Next week students will read this. This is important for final exam for verbal section.
From the textbook తెలుగు వాచకం 1వ తరగతి, I read (as students were following) and discussed about Ugadi festival (pg 18 & 19). Next week students will read this. This is important for final exam for verbal section.
Plan for next week
Padyalu revision
Ugadi - Reading (by students) & discussion
Srirama navami (I will read and students will follow). Discussion about the festival will follow.
Homework
This was the homework for last class. Students did not complete this. Please work with students to complete it
Students are expected to work with parents. First, parents read a paragraph (given below) and the students write. Next, the students themselves read it.
The 2 paragraphs below - both must be practiced
బాలుడు - వీణ వాయించే తోడేలు
ఒక బాలుడు తన తోటి వారితో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి అడవి గుండా వెళుతూ వెనకపడ్డాడు. ఒక తోడేలు అతనిని పట్టుకోటానికి వెంటపడింది. ఆ బాలుడు భయపడ్డాడు. కాని కొంచెం ధైర్యం తెచ్చుకొని తోడేలుతో ఇలా అన్నాడు. "ఎలాగూ నేను నీకు ఆహారమే. నువ్వు వీణ వాయిస్తే నేను నృత్యం చేస్తాను. ఇది నా చివరి కోరిక". తోడేలు సరే అని అక్కడ పక్కగా పడి వున్న వీణ వాయించడం మొదలు పెట్టింది. బాలుడు నృత్యం చేయసాగాడు.
అంతలో ఈ గొడవ విని వేటకుక్కలు తోడేలు వెంట పడ్డాయి. బాలుడు హమ్మయ్య అని తప్పించుకున్నాడు.
నీతులు:
1. అక్కర్లేనివి పట్టించుకుని అందుకోపోతే చేతికొచ్చిన అవకాశం జారిపోతుంది
2. ఉపాయం తో అపాయాన్ని తప్పించుకోవచ్చు
కుక్క, కోడిపుంజు, నక్క
ఒక కుక్క, కోడిపుంజు స్నెహంగా ఉండేవి. ఒకరోజు అవి రెండూ కలిసి ఆడుకుని తరువాత కోడిపుంజు చెట్టు కొమ్మ మీద, కుక్క చెట్టు తొర్రలో నిద్ర పోయాయి. ఇంతలో ఒక నక్క వచ్చి "కోడి బావ నువ్వు ఎంత బాగా పాడతావో, నిన్ను ఒక్క సారి కౌగిలించుకుంటాను వస్తావా" అంది. కోడికి నక్క అసలు కోరిక అర్థమయ్యింది. "నువ్వు చెట్టు తొర్రలోని కాపలాదారుని లేపు. అలాగే వచ్చి నిన్ను కౌగిలించుకుంతాను" అని కోడి అంది. నక్క గట్టిగా ఊళ పెట్టి తొర్రలోకి చూసే సరికి కుక్క బయటికి వచ్చి నక్కని చంపి తినేసింది.
నీతి:అపాయాన్ని ఉపాయంతో గెలవాలి
Please note:
Please bring the books (తెలుగు వాచకం 1వ తరగతి, తెలుగు వాచకం 2వ తరగతి) to class for discussions
Please maintain a note book and a binder for Telugu class. Encourage the students to speak only in Telugu at home
No comments:
Post a Comment